
43,047 అర్జీలు
1,282 గ్రామాలు..
వివరాలు 8లో u
ఉమ్మడి జిల్లాలో
ముగిసిన భూ భారతి సదస్సులు
● నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా
15,599 దరఖాస్తులు
● నారాయణపేటలో అత్యల్పంగా 4,052
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:
రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో తప్పులను సవరిస్తూ.. మార్పులు, చేర్పులతో భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. నిర్దేశిత గడువు శుక్రవారంతో ముగియగా.. మొత్తంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 1,282 గ్రామాలకు సంబంధించి 43,047 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 15,559 అర్జీలు రాగా.. నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 4,052 వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
జిల్లాల వారీగా ఇలా..
● మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలో 1,317 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 2,348, భూ విస్తీర్ణంలో తప్పులపై 966, భూ యజమాని పేర్లలో తప్పులు సవరించాలని 435 అర్జీలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
● నారాయణపేట జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు జరగగా.. నారాయణపేట మండలంలో అత్యధికంగా 1,230 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 1,284, భూ విస్తీర్ణంలో తప్పులపై 776, పేర్లలో తప్పులు సవరించాలని 335 మంది దరఖాస్తు చేసుకున్నారు.
● జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గద్వాల మండలంలో అత్యధికంగా 1,324 అర్జీలు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు సవరించాలని 832, పెండింగ్ సక్సేషన్లపై 750, అసైన్డ్‌మెంట్ ల్యాండ్‌లపై 640, గెట్ల పంచాయితీలపై 200 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
● నాగర్‌కర్నూల్ జిల్లాలో 19 మండలాల పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,559 దరఖాస్తులు వచ్చాయి. కొల్లాపూర్ మండలం నుంచి అత్యధికంగా 2,138 అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 3,921, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,062, పేర్లలో తప్పులు సవరించాలని 478 మంది దరఖాస్తు చేసుకున్నారు.
● వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగగా.. అత్యధికంగా పాన్‌గల్ మండలంలో 1,555 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 1,135, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,064, పేర్లలో తప్పులకు సంబంధించి 824 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా సదస్సులు, దరఖాస్తుల వివరాలు..
జిల్లా సదస్సులు వచ్చిన
నిర్వహించిన దరఖాస్తులు
గ్రామాలు
మహబూబ్‌నగర్ 293 9,610
జోగుళాంబ గద్వాల 198 5,800
నాగర్‌కర్నూల్ 338 15,559
నారాయణపేట 234 4,052
వనపర్తి 219 8,026