
శిథిలావస్థలోకి పాఠశాల..
మన్ననూర్: మన్ననూర్‌లోని గిరిజన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు గతంలో 200 మంది వరకు విధ్యార్థులు ఉండేవారు. పక్కనే గిరిజన హాస్టల్ ఉండేది. ప్రస్తుతం అదే హాస్టల్‌లో గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. తరగతి గదులు, నిర్వహణకు గాను మొత్తం 11 గదులు 7 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే విద్యార్థులకు తగిన విధంగా 2 గదులు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 40 మంది విద్యార్థులు కాగా గురువారం 14 మంది మాత్రమే పాఠశాలకు హాజరు కావడంతో అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధించడం గమనార్హం.