రేపు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రేపు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు ఎంపిక

Jun 20 2025 6:35 AM | Updated on Jun 20 2025 6:35 AM

రేపు బెస్ట్‌ అవైలబుల్‌  స్కూల్‌కు ఎంపిక

రేపు బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు ఎంపిక

నాగర్‌కర్నూల్‌: జిల్లాలోని బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌కు సంబంధించి 2025– 26 సంవత్సరానికి గాను శనివారం 1, 5 తగరతులల్లో ప్రవేశాల కోసం షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు ఎంపికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లోని ప్రజావాణి మందిరంలో లక్కీ డిప్‌ ద్వారా జిల్లా కమిటీ సమక్షంలో ఎంపికలు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలని కోరారు.

22న జిల్లాస్థాయి

అథ్లెటిక్స్‌ ఎంపికలు

కల్వకుర్తి రూరల్‌: పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా అథ్లెటిక్స్‌ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు విజయేందర్‌, స్వాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 6న హనుమకొండలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్స్‌ పోటీల కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10, 12, 14 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

‘శూన్యం’ పుస్తకావిష్కరణ

కందనూలు: జిల్లాకేంద్రానికి చెందిన ఫిజిక్స్‌ అరుణ్‌కుమార్‌ రాసిన తొలి కవితా సంపుటి శూన్యం పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో సామాజిక స్పృహ, శాసీ్త్రయతతో కూడిన పుస్తకాలు రాయాలన్నారు. కార్యక్రమంలో ముచ్చర్ల దినకర్‌, వనపట్ల సుబ్బయ్య, ఎదిరేపల్లి కాశన్న పాల్గొన్నారు.

భూ భారతి దరఖాస్తుల విచారణ పూర్తిచేయాలి

నాగర్‌కర్నూల్‌: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఫీల్డ్‌ విచారణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నూతన ఆర్‌ఓఆర్‌ చట్టం, భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై కలెక్టర్‌ అదనపు కలెక్టర్‌ అమరేందర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ కార్డుల మంజూరు చేయాలని, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రాల వారిగా బూత్‌ స్థాయి అధికారుల నియామకం, నూతన పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా చేయాలని సూచించారు.

ఉచిత శిక్షణకు

దరఖాస్తుల స్వీకరణ

కందనూలు: రాష్ట్ర షెడ్డ్యూల్డ్‌ కులాల స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఉచిత శిక్షణకు ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్డ్యూల్డ్‌ అభివృద్ధి అధికారి రామ్‌లాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025– 26 సంవత్సరానికి గాను సివిల్స్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు http://tsstudy circle.co.in లో శుక్రవారం నుంచి వచ్చేనెల 7 వరకు లాన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదన్నారు. వీరికి వచ్చే నెల 13న హైదరాబాద్‌, ఇతర సెంటర్లలో పరీక్ష ఉంటుందని, పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం 040– 23546552, 8121626423 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

కళాశాలకు

షోకాజ్‌ నోటీసులు

కందనూలు: అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కొల్లాపూర్‌లోని ఎస్‌వీఎస్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని డీఐఈఓ వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. అనుమతి లేని కళాశాలలో ఎవరు కూడా అడ్మిషన్‌ తీసుకోవద్దని, ఎవరైనా అడ్మిషన్లు తీసుకుంటే వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement