
బఫర్ జోన్ హద్దులు ఏర్పాటుచేయాలి..
కొల్లాపూర్‌లోని మూలవాగు సమీపంలో నేను పదేళ్ల క్రితం ప్లాటు కొనుగోలు చేశాను. వాగుకు దూరంగా ప్లాటు ఉంది. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపు కోసం స్లాట్ బుక్ చేసుకున్నా. కానీ ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ స్వీకరించడం లేదు. అధికారులు వాగుకు బఫర్‌జోన్ హద్దులు ఏర్పాటుచేసి, ఆన్‌లైన్‌లో పెడితే ఎల్‌ఆర్‌ఎస్ తీసుకుంటారని చెబుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి హద్దులు ఏర్పాటుచేయాలి.
– బాలకృష్ణ, కొల్లాపూర్
సమస్య మా దృష్టికి వచ్చింది..
వాగుల సమీపంలోని ప్లాట్లకు బఫర్ జోన్లు ఏర్పాటు చేయక పోవడం వల్ల ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ స్వీకరణ జరగడం లేదు. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు వివరించాం. బఫర్‌జోన్ నిర్ణయం బాధ్యత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలది. వారు హద్దులు నిర్ణయిస్తే మేము ఆన్‌లైన్‌లో ఓకే చేస్తాం. ఈ అంశంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతాం.
– శ్రీనివాస్,
మున్సిపల్ కమిషనర్, కొల్లాపూర్
●

బఫర్ జోన్ హద్దులు ఏర్పాటుచేయాలి..