
బ్యూటిఫుల్.. రామప్ప టెంపుల్
వెంకటాపురం(ఎం) : బ్యూటిఫుల్..రామప్ప టెంపుల్ అంటూ స్వీడన్ దేశానికి చెందిన ప్రొఫెసర్ లూయిస్ స్టేవా పేర్కొన్నారు. శనివారం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆయన సందర్శించి రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా, టూరిజం గైడ్ విజయ్‌కుమార్ ఆలయ విశిష్టతను వివరించారు. కాగా రామప్ప శిల్పకళా సంపద బాగుందని స్టేవా కొనియాడారు.
మురుగు కాల్వలో మొసలి పిల్ల
వెంకటాపురం(కె): పాత్రపురం గ్రామంలోని మురుగు నీటికాల్వలో శనివారం మొసలి పిల్ల ప్రత్యక్షం కాగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సమాచారం అందించగా వారు అటవీశాఖ అధికారులకు విషయం చెప్పారు. అనంతరం అధికారులు మొసలి పిల్లను పట్టుకొని సురక్షిత ప్రాంతంలో వదిలిలేశారు. ఇంకెన్ని మొసలి పిల్లలు గ్రామంలోకి వచ్చి ఉంటాయోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

బ్యూటిఫుల్.. రామప్ప టెంపుల్