
మోనాలిసా భోంస్లే (16) పేరు సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్ అయింది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఇంటర్నెట్‌ను ఊపేసిన నిరుపేద యువతి. అయితే, ఆమె ఫోటోలు వైరల్ కావడంతో భారీగా పాపులారిటీ వచ్చింది. దీంతో ఆమెకు ఏకంగా బాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు, ప్రముఖ టీవీ షోలకు అతిథిగా ఆమె హాజరైంది. ఇప్పుడు ఈ బ్యూటీకి మాలీవుడ్‌లో సినిమా ఛాన్స్ దక్కింది.
మోనాలిసా భోంస్లే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'నాగమ్మ' చిత్రం పూజా కార్యక్రమం ఇటీవల కొచ్చిలో జరిగింది. దీనికి ప్రఖ్యాత చిత్ర నిర్మాత సిబి మలైల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మూవీని పి. బిను వర్గీస్ దర్శకత్వం వహిస్తుండగా.. జీలి జార్జ్ నిర్మిస్తున్నారు. మలయాళ చిత్రం 'నీలతామర'లో మెప్పించిన కైలాష్ మోనాలిసాతో నటించనున్నారు. చిత్రనిర్మాతల ప్రకారం, నాగమ్మ షూటింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభం కానుంది.
పూజలో, మోనాలిసా గులాబీ రంగు లెహంగాలో కనిపించి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమెకు వరుస సినిమా ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో పాటు కొన్ని యాడ్స్‌లలో కూడా నటిస్తుంది. ప్రస్తుతం మలయాళ పరిశ్రమ నుంచి ఆమెకు గోల్డెన్ ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు.