
ఇద్దరు మేధావులు ట్రిప్‌కు వెళ్తే ఎంత రచ్చ రచ్చ చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అంకుల్ వీకెండ్ ట్రిప్‌కు..
చిరంజీవి చిరు బ్రేక్ తీసుకున్నాడు. ఆచార్య షూటింగ్ కోసం తీవ్రంగా కష్టపడుతున్న ఆయన తన జిగిరీ దోస్త్, విలక్షణ నటుడు మోహన్‌బాబును వెంటేసుకుని స్పెషల్ టూర్‌కు వెళ్లాడు. ఈ విషయాన్ని మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు వారిద్దరూ ఒకే ఫ్రేములో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. "ఇద్దరు మేధావులు సిక్కిం ట్రిప్‌కు వెళ్తే ఎంత రచ్చ రచ్చ చేస్తారో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి అంకుల్ వీకెండ్ ట్రిప్‌కు నాన్నను దగ్గరుండి ఒప్పించి మరీ తీసుకెళ్లాడు. ఈ విషయంలో నాకు కొంత ఈర్ష్యగానే ఉంది. కానీ మీ ఇద్దరూ కాలక్షేపం చేసేందుకు సమయం దొరికినందుకు నా హృదయం సంతోషంతో ఉప్పొంగిపోతోంది. కానీ ఈ ట్రిప్‌లో ఏదో ఒక రోజు మేము కూడా మీతో పాటు జాయిన్ అవుతాము" అని ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మమ్మల్ని కూడా తీసుకెళ్తే ఎంత బాగుంటుందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
When two maestros go for a quick trip to Sikkim, you know it’s going to be 🔥
— Lakshmi Manchu (@LakshmiManchu) March 15, 2021
Only @KChiruTweets uncle you could have convinced Nana for a quick weekend trip to Sikkim! I’m so jealous! So good to see you both having a nice time. Heart is full! Let us kids accompany you someday 😝 pic.twitter.com/9EGBN7Tjam
కాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'లో తనయుడు రామ్‌చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీకొడుకుల సరసన కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ చిత్రం సమ్మర్‌లో మే 13న రిలీజ్ కానుంది. మరోవైపు మోహన్‌బాబు దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కుతున్న 'సన్నాఫ్ ఇండియా’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ పతాకం సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయారాజా సంగీతం అందిస్తున్నారు.