
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కెరీర్లో 47వ చిత్రంగా ఈ మూవీ నిలవనుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీకి మార్క్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్కు థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మూవీని సత్య జ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.