The Kashmir Files Movie: సినిమా కోసం ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్‌

Assam CM Announces Half Day Leave For Government Employees To Watch The Kashmir Files - Sakshi

Assam Govt Employees To Get Half-Day Leave To Watch The Movie: ప్రముఖ దర్శకుడు  వివేక్‌ అగ్ని హోత్రి ఇటీవల తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. సీనీ, రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ సినిమాని ప్రశంసించారు. ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఈ సినిమా చూడాలంటూ ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించాడు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటకతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’​​​​​​పై వినోదపు పన్నును తొలగించింది.

ఇదిలా ఉంటే తాజాగా..ఈ సినిమా చూడడం కోసం అస్సాం ప్రభుత్వం ఉద్యోగులకు సెలవు ప్రకటించి ఆశ్చరపరిచింది. ఈ సినిమా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్‌డే లీవ్‌ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు పై అధికారికి సినిమా టికెట్‌ చూపించి, లీవ్‌ అప్లై చేస్తే హాప్‌డే లీవ్‌ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఒక సినిమా కోసం ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం. 1980-90లలో కశ్మీర్‌లో ఓ వర్గంపై మరో వర్గం చేసిన మారణకాండ ఆధారంగా  'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వికేక్‌ అగ్నిహోత్రి. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ మరియు మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top