కలెక్షన్ ఫుల్!
నర్సాపూర్: ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్న గ్రామ పంచాయతీలకు పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి బకాయి ఉండరాదన్న నియమం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సైతం ఆ నిబంధన వర్తించటంతో పోటీ చేసే అభ్యర్థులు తమ ఇంటి పన్ను, నల్లా బిల్లులు చెల్లించి కార్యదర్శుల నుంచి నోడ్యూ సర్టిఫికెట్ పొంది తమ నామినేషన్ పత్రాలకు జత చేయాల్సి ఉంటుంది. కాగా ఎలాగైనా పోటీ చేసే అ భ్యర్థులు పన్నులు చెల్లించాల్సి ఉండడంతో స్థానిక మండల ప్రజాపరిషత్ అధికారులు బుధవారం నామినేషన్లు స్వీకరణలో భాగంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఆ పక్కనే పంచాయతీ కార్యదర్శు లు ఇంటి, నల్లా పన్నులు వసూలు చేశారు. కాగా ఆయా పంచాయతీల నుంచి రూ. 33,500 వసూలు అయినట్లు అధికారులు చెప్పారు.


