నగదు పట్టివేత
హవేళిఘణాపూర్(మెదక్): మండల పరిధిలోని మంభోజిపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 3.30 లక్షలను పట్టుకున్నట్లు మెదక్ రూరల్ ఎస్‌ఐ లింగం తెలిపారు. పాపన్నపేట మండలం అబ్లాపూర్‌కు చెందిన కుమ్మరి అనిల్ ఎన్నికల సమయంలో డబ్బులు తరలిస్తుండగా పట్టుకున్నామన్నా రు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు, మద్యం తరలిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
మెదక్‌జోన్: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. బుధవారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం హోదాలో హిందూ దేవుళ్లను కించ పరిచే విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రంజిత్‌రెడ్డి, కల్కి నాగరాజు, సంగీత, లోకేష్, స తీష్, నాయిని ప్రసాద్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: ఈనెల 7, 8, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహించే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం పిలుపునిచ్చారు. బుధవారం మెదక్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో 2 కే రన్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభల్లో అన్నిరంగాల కా ర్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు. ఇప్పటికే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కార్మికుల హక్కులు, చట్టాలకు ప్రశ్నించే హక్కు లేకుండా ఉక్కుపాదం మోపిందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు మల్లేశం, పట్టణ కార్యదర్శి సంతోష్, నాయకులు బాలనర్సు, సాయిలు, రాజు, నరేష్, ఆకాష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట(నర్సాపూర్): దివ్యాంగులను ఎవ రైన హేళన చేస్తే చట్ట ప్రకారం శిక్ష పడుతుందని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి హేమలత అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధి మగ్థుంపూర్‌లోని బేతాని సంరక్షణ ఆశ్రమంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి దివ్యాంగులతో కలిసి కేక్ చేసి మాట్లాడారు. వైకల్యం వారి శరీరానికి మాత్రమేనని మేధస్సుకు కాదన్నారు. ఆశ్రమంలో ఉన్న మానసిక వికలాంగులకు ఆధార్ కార్డులతో పెన్షన్ మంజూరుకు నర్సాపూర్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాది స్వరూపరాణి, ఆశ్రమ నిర్వాహకులు సెబాస్టర్, వీరబాబు, విన్సెంట్, కార్‌మాల్, కోర్టు కానిస్టేబుల్ ఆనంద్, శంకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
నగదు పట్టివేత
నగదు పట్టివేత
నగదు పట్టివేత


