క్రీడలతో శారీరక దారుఢ్యం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడతాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. హోంగార్డు రైసింగ్ డేను పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడా రు. సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడంలో క్రీడలు విశేషంగా దోహదం చేస్తాయని తెలిపారు. వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు ఈనెల 6న జరగనున్న రైసింగ్ డే పరేడ్ కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, ఆర్‌ఐలు రామకృష్ణ, శైలేందర్, ఆర్‌ఎస్‌ఐలు, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.
నేటి నుంచి వెస్లీ ఉన్నత ´ëuý‡-Ô>-ÌSÌZ OòܯŒ Þ òœÆ‡¬ÆŠḥæ


