మంచోళ్లనే ఎన్నుకోండి | - | Sakshi
Sakshi News home page

మంచోళ్లనే ఎన్నుకోండి

Dec 4 2025 8:46 AM | Updated on Dec 4 2025 8:46 AM

మంచోళ

మంచోళ్లనే ఎన్నుకోండి

హుస్నాబాద్‌: ‘మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలివి.. పంచాయతీ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి అభివృద్ధికి బాటలు వేసే వాళ్లను ఎన్నుకుందాం.. అభివృద్ధికి అడ్డుపడెటోళ్లను, కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే ము నిగేది మనమే’ అని మఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో బుధవారం విజయోత్సవ సభ నిర్వహించారు. సభ కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కేసీఆర్‌ హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తాము హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు.

రూ. 262.78 కోట్లతో శంకుస్థాపనలు

హుస్నాబాద్‌ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు సభా ప్రాంగణంలోనే సీఎం శంకుస్థాపన లు చేశారు. ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినులకు సీఎం చేతుల మీదుగా 70 సైకిళ్లు పంపిణీ చేశారు. ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ వెహికిల్‌ను ప్రారంభించారు. హుస్నాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్‌ బస్సును జెండా ఊపి ప్రారంభించారు.

అన్ని పాఠశాలల్లోనూ మౌలిక వసతులు

నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మహిళలు పాడిపరిశ్రమంలో అభివృద్ధి చెందేలా ఒక మంచి పథకానికి శ్రీకారం చుడుతామన్నారు. సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ నాలుగు జిల్లాలకు కేంద్రబిందువుగా మారిన హుస్నాబాద్‌ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించాలని సీఎంకు విన్నవించారు. పట్టణంలో వరద నీటి సమస్య తలెత్తకుండా అండర్‌ డ్రైనేజే సిస్టమ్‌ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే కాలువల నిర్మాణాలు నిర్మించుకుంటున్నామన్నారు. వచ్చే సీజన్‌లో ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు.

నాడు కరెంట్‌ తీస్తే..

నేడు జీరో బిల్లు ఇస్తుండ్రు

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కరెంట్‌ చార్జీలు పెంచి కరెంట్‌ను తీసేసిన అధికారులే నేడు జోరో బిల్లు ఇస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బి య్యం తీసుకున్న వాళ్లంతా కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌లను ఎన్నుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అనుగుణంగా హుస్నాబాద్‌లో రూ.65 కోట్లతో ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ఖజానా ఖాళీ చేసిండ్రు..

బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ ఖజానాను ఖాళీ చే సి కుటుంబమంతా ఆస్తులను పెంచుకున్నారని మంత్రి వివేక్‌ అన్నారు. ప్రజాసంక్షేమానికే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే మునిగేది మనమే

హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

మంచోళ్లనే ఎన్నుకోండి1
1/1

మంచోళ్లనే ఎన్నుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement