
రైతు మురిసె
మత్స్యకార మణిహారం..
నీ కోసం.. నేనున్నానని..
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన ప్రసాద్ సూరి ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు..
– వివరాలు ఫ్యామిలీ యువర్స్‌లో
వాన కురిసె..
జీవితంలోని సంక్షోభ సమయాల్లో తన తల్లి తనకు అండగా నిలబడిందని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ చెప్పారు.
– వివరాలు 2లో
మొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే బోరు బావుల కింద వరి నాట్లు ప్రారంభం కాగా, వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తితో పాటు ఆరుతడి పంటలకు వర్షాలు జీవం పోశాయి.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో సింహభాగం 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. మిగితా 45 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయి. కాగా మేలో కురిసిన ముందస్తు వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పత్తి, కూరగాయలతో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. 112.7 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 81.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 31.2 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. అయితే గత వారం రోజులుగా పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కౌడిపల్లి, కొల్చారం, హవేళిఘనాపూర్, శివ్వంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట తదితర మండలాల్లో బోరుబావుల కింద రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. కాగా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు చేరిన తర్వాతే ఆయకట్టు భూముల్లో నాట్లు వేయనున్నారు.
పెరిగిన భూగర్భజలాలు
జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. మేలో 15.37 మిల్లీమీటర్లు ఉండగా, జూన్‌లో 14.22 మిల్లీ మీటర్లకు చేరుకుంది. ఈ లెక్కన 1.15 మిల్లీమీటర్ల మేర పెరగటంతో బోరుబావుల్లో నీటి ఊటలు పెరిగాయి. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం జూన్ చివరి వారం నుంచి వర్షాలు కురువటంతోనే భూగర్భజలాలు పెరిగాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.
ఊపందుకున్న వ్యవసాయ పనులు పత్తి, ఆరుతడి పంటలకు జీవం
హల్దీవాగుపై 12 చెక్‌డ్యాంలు
జిల్లాలోని హల్దీ ప్రాజెక్టు తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం, చిన్నశంకరంపేట, మెదక్, హవేళిఘనాపూర్ మండలాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ వాగుపై 12 చెక్ డ్యాంలు నిర్మించారు. ఏటా వేసవిలో కొండపోచమ్మసాగర్ నుంచి ఇందులోకి నీరు వదులుతారు. ఒక్కసారి నీరు వదిలితే 50 వేల ఎకరాల మేర వరి పంట పండుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 7 మండలాల్లో రైతులు వరి నాట్లు జోరుగా వేస్తున్నారు.

రైతు మురిసె

రైతు మురిసె