
పిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైనార్టీ పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం, వసతి సౌకర్యాలను ఆరా తీశారు. అనంతరం గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించే దిశలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్