వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరక | - | Sakshi
Sakshi News home page

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్‌ ఇంట్రెస్ట్‌ గ్రూప్‌ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరక

Jul 5 2025 10:44 AM | Updated on Jul 5 2025 10:44 AM

వీధి

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధి

● వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ● మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సన్నాహాలు ● మెప్మాకు ప్రభుత్వం ఆదేశం ● బ్యాంకుల నుంచి రుణ సదుపాయం

జిల్లా వివరాలు..

మున్సిపాలిటీ వీధి ఏర్పాటు చేసే

వ్యాపారులు సంఘాలు

మెదక్‌ 4,096 25

నర్సాపూర్‌ 1,222 15

తూప్రాన్‌ 1,562 14

రామాయంపేట 1,320 20

మెదక్‌లో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లు

జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో 74 వరకు సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి గ్రూపులో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడతగా మొత్తం 8,200 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖాతాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరునెలల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ. లక్ష, తర్వాత రూ. 3 నుంచి రూ. 5 లక్షలు, సకాలంలో చెల్లిస్తే రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా పీఎం స్వానిధి పథకం కింద దుకాణాలు నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రమైన మెదక్‌లో పోస్టాఫీస్‌ పక్కనే 25 రేకుల షెడ్డులు నిర్మించారు. త్వరలో వీటిని వీధి వ్యాపారులకు కేటాయించనున్నారు. మిగితా మూడు మున్సిపాలిటీల్లో సైతం వీటిని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

సభ్యులకు బీమా సదుపాయం

పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మృతిచెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు కార్డులు అందజేశారు. దుకాణాలు కేటాయించిన అనంతరం వారితో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్‌గా మున్సిపల్‌ కమిషనర్‌ ఉంటారని సమాచారం.

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధి1
1/2

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధి

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధి2
2/2

వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement