
గురుకులాల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్‌రాజ్
తూప్రాన్/నర్సాపూర్: ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. శుక్రవారం పట్టణంలో పలు గురుకులాలు, కళాశాలను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా..? అని ఆరా తీశారు. బియ్యం నిల్వ లు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితు ల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండ పాఠశాల సముదాయాన్ని, పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నర్సాపూర్‌లో మండలంలోని గురు కుల పాఠశాలలు, కాలేజీలను తనిఖీ చేశారు. సమస్యలు తెలుసుకొని, సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత లేని బియ్యం వస్తే ఎంఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
మెదక్‌జోన్/మెదక్‌మున్సిపాలిటీ: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపాలని, అందుకోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమాజానికి చీడ పురుగులా మారిన నిరోధానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్‌లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదకరమైన మలుపుల వద్ద సైన్ బోర్డులు రేడియం స్టికర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు.