
ఖర్గేకు సన్మానం
నర్సాపూర్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సన్మానించారు.
పెండింగ్ వేతనాలు
చెల్లించండి
శివ్వంపేట(నర్సాపూర్): పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కార్మికులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
సమర్థవంతంగావిధులు నిర్వర్తించాలి
కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల విధులను సమర్థవంతగా నిర్వర్తించాలని ఆర్డీఓ మహిపా ల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్‌ఓలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోనూ కావొద్దన్నారు. బూత్‌స్థాయి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ కార్డును పరిశీంచాలన్నారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల పత్రాలపై బీఎల్‌ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, మాస్టర్ ట్రైనర్లు లక్ష్మీనారాయణ, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోరాటయోధుడు
దొడ్డి కొమురయ్య
మెదక్ కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో బీసీ సామాజిక ఉద్యమ నాయకుడు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతిని వేర్వేరుగా నిర్వహించారు. ఈసందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, ఇతరశాఖల అధికారులు ఉన్నారు.
ఉత్తమ పంచాయతీల
ఎంపికపై అవగాహన
పెద్దశంకరంపేట(మెదక్): జాతీయ ఉత్తమ పంచాయతీల ఎంపిక, అవార్డులపై శుక్రవారం మెదక్ డీఎల్‌పీఓ సురేష్‌బాబు ఆయా శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఉత్తమ పంచాయతీల ఎంపికపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంఈఓ వెంకటేశం, ఏఓ కృష్ణ, ఏఎస్‌ఐ చంద్రమోహన్, ఏపీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఖర్గేకు సన్మానం

ఖర్గేకు సన్మానం

ఖర్గేకు సన్మానం