
● విత్తన, ఎరువుల దుకాణాలపై కొరడా ● వ్యవసాయ, పోలీస్ అధి
వర్షకాలం సీజన్ ప్రారంభమవడంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా చూడాలని వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అప్పమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలిన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండలంలో పీఏసీఎస్, నాబార్డ్ పరిధిలో ఒక్కొక్కటి, అలాగే ఆగ్రో రైతుసేవా కేంద్రంతోపాటు మరో మూడు ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఉన్నాయి. అన్ని దుకాణాలలో అధికారులు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులు పరిశీలించి, నకిలీ విత్తనాలమ్మితే దుకాణం సీజ్‌చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు అమ్మినా నేరమని, అలాంటి దుకాణ యజమానుల వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
ఎరువులు, విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు చేసిన విత్తనాలు ఇతర దుకాణాలలో ఏ ధరలకు దొరుకుతున్నాయో ఆరా తీయాలి. అవసరమైతే వ్యవసాయాధికారుల సల హాలు తీసుకోవాలి. ముఖ్యంగా కొనుగోలు చేసిన రశీదులు తప్పనిసరిగా జాగ్రత్త చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.
చిలప్‌చెడ్‌లోని ఓ ఎరువుల దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న ఏఓ, ఎస్‌ఐ