
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
మెదక్‌జోన్: రోజురోజుకు ఆర్థికంగా చితికిపోతున్న స్వర్ణకారులను ఆదుకునేందుకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పూనా రవిచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణకారులు వృత్తిపై ఆధారపడి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దౌర్భాగ్య దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. స్వర్ణకారుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లిప్త ధోరణితో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా సానుకూలంగా స్పందించి స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఏలేశ్వర బ్రహ్మచారి, కార్యదర్శి ఇటిక్యాల వేణు, కోశాధికారి ఎస్. కాశీనాతం, నాయకులు బ్రహ్మం,డి. మహేష్, సి.హెచ్.నరేష్, ఎం. నవీన్, రాజు తదితరులున్నారు.
స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచారి