
క్షేత్రస్థాయిలో భూ భారతి దరఖాస్తుల పరిశీలన
మెదక్ ఆర్‌డీఓ రమాదేవి
చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి దరఖాస్తుల పరిష్కారం కోసం అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వేయర్‌తో కలిసి పరిశీలించాలని మెదక్ ఆర్‌డీఓ రమాదేవి ఆదేశించారు. గురువారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అధికారులతో భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అందించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ మన్నన్, ఉప తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్‌ఐ రాజు పాల్గొన్నారు.
పకడ్బందీగా
వంద రోజుల ప్రణాళిక
మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి
నర్సాపూర్: మున్సిపల్ కమిషనర్‌గా శ్రీరాంచరణ్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తానని చెప్పారు. పట్టణ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, కమిషనర్‌ను మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, ఇతర సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కూలీలకు పని
కల్పించడమే లక్ష్యం
డీఆర్డీఏ ఏపీడీ రంగాచారి
కొల్చారం(నర్సాపూర్): కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడమే లక్ష్యంగా గ్రామ క్షేత్ర సహాయకులు పనిచేయాలని, పనుల్లో పారదర్శకత తప్పనిసరని డీఆర్డీఏ ఏపీడీ రంగాచారి అన్నారు. బుధవారం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. మండంలోని 21 గ్రామపంచాయతీల్లో 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఈజీఎస్, అటవీశాఖల ద్వారా రూ.4 కోట్ల 65 లక్షల పనులు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పనులు జరిగే సమయంలో క్షేత్ర సహాయకులు మాస్టర్స్‌లో దిద్దుబాటు చర్యలు చేపట్టామని, ఇందుకుగాను రూ.3వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీఓ కష్ణవేణి, ఏపీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమానికి పెద్దపీట
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్
కొల్చారం(నర్సాపూర్): పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఎనగండ్ల గ్రామంలో శక్తి కేంద్రం ఇన్‌చార్జి శివప్రసాద్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు హరీష్, ఉపాధ్యక్షుడు వెంకటయాదవ్, కార్యదర్శి నాగరాజు, మాజీ ఉపాధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
నేడు డీసెట్
ధ్రువపత్రాల పరిశీలన
హవేళిఘణాపూర్(మెదక్): గతంలో డీసెట్ అర్హ త సాధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారి కోసం శుక్రవారం ధ్రువపత్రాలను పరిశీలించేందుకు అవకాశం కల్పించినట్లు డైట్ ప్రిన్సిపాల్, డీఈవో రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు చేరుకొని ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎంపిక కోసం 28 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, జూలై 1న ఆప్షన్లకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉంటుందని, ఫేజ్–1లో సీటు పొంది వివిధ కళాశాలలో ప్రవేశం పొందిన వారు సైడ్లింగ్ ఆప్షన్ వినియోగించుకోవచ్చని సూచించారు.

క్షేత్రస్థాయిలో భూ భారతి దరఖాస్తుల పరిశీలన

క్షేత్రస్థాయిలో భూ భారతి దరఖాస్తుల పరిశీలన

క్షేత్రస్థాయిలో భూ భారతి దరఖాస్తుల పరిశీలన