కేంద్ర పథకాలపై రచ్చబండ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర పథకాలపై రచ్చబండ

Jun 24 2025 7:36 AM | Updated on Jun 24 2025 7:36 AM

కేంద్

కేంద్ర పథకాలపై రచ్చబండ

రామాయంపేట(మెదక్‌): కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రాగి రాములు అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ కృషితో దేశ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని కొనియాడారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు శీలం అవినాశ్‌రెడ్డి, నాయకులు చింతల శేఖర్‌, శంకర్‌గౌడ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు రైతులతో

సీఎం ముఖాముఖి

మెదక్‌ కలెక్టరేట్‌: సీఎం రేవంత్‌రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో మాట్లాడుతారని అన్నారు. కార్యక్రమాన్ని పండగల నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం భూ భారతి రెవెన్యూ సదస్సులపై అధికారులతో చర్చించారు. సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు పటిష్ట కార్యాచరణతో మందుకుసాగాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

సమ్మె నోటీసులు అందజేత

నర్సాపూర్‌: జూలై 9వ తేదీన చేపట్టే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని పలు శాఖల ఉద్యోగులు సోమవారం ఆయాశాఖల అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఐసీడీఎస్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ హఫీజాబేగంకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయ అధికారికి కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు.

నేడు ఎస్సీ, ఎస్టీ

కమిషన్‌ చైర్మన్‌ రాక

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య పర్యటించనున్నట్లు డీఎల్‌పీఆర్‌ఓ రాంచంద్రరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులపై సమీక్ష ఉంటుందని తెలిపారు. అనంతరం ఏడుపాయ ల దుర్గమ్మను దర్శించుకోనున్నట్లు చెప్పారు. జిల్లాలోని దళిత, ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, జిల్లా అధికారులు సమీక్ష సమావేశానికి హాజరుకావాలని కోరారు.

పేదల సొంతింటి కల సాకారం

డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌

నర్సాపూర్‌ రూరల్‌/శివ్వంపేట: ఇందిరమ్మ ఇంటితో పేదల సొంతింటి కల నెరవేరుతుందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఎల్లాపూర్‌, మాడాపూర్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డితో కలసి కాంగ్రెస్‌ జెండాలను ఆవిష్కరించి, ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల మద్ద తుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కావాలని కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో కో ఆపరేటివ్‌ చైర్మన్‌ రాజు యాదవ్‌, మాజీ జెడ్సీటీసీ గుప్తా, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్‌, నాయకులు సురేష్‌ నాయక్‌, ఉదయ్‌, వినోద, అజ్మత్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే శివ్వంపేట మండల పరిధిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డికి సమాచారం లేకుండా భూమి పూజ ఎలా చేస్తారని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశ్నించడంతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో తనకు ఇల్లు మంజూరు కాలేదని కాంగ్రెస్‌ నా యకుల కాన్వాయ్‌ని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు.

కేంద్ర పథకాలపై రచ్చబండ 
1
1/1

కేంద్ర పథకాలపై రచ్చబండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement