
రంగనాయక సాగర్‌కు హైకోర్టు న్యాయమూర్తి
న్యాయమూర్తి శ్రీసుధాను సన్మానిస్తున్న కలెక్టర్ మనుచౌదరి
చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర హైకో ర్టు న్యాయమూర్తి పి.శ్రీసుధా ఆదివారం మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద గల అతిథి గృహానికి విశ్రాంతి కోసం వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లిన న్యాయయూర్తి శ్రీసుధా తిరుగు ప్రయాణంలో రంగనాయక సాగర్ అతిథి గృహంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నారు. ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో న్యాయ విషయాల గురించి కాసేపు చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి, ఆర్డీఓ సదానందం, ఏసీపీ మధు, న్యాయవాదులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.