
‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన
రామాయంపేట(మెదక్): రామాయంపేటలో సమీకృత గురుకుల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆదివారం పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సందర్శించారు. స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటికే రూ. 200 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 1421 సర్వే నంబర్‌లో జాతీయ రహదారిని అనుకొని ఉన్న 20 ఎకరాల స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రభాకరన్, క్వాలిటీ సర్వేయర్ ఓబుల్‌రెడ్డి, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఫైజాన్ అహ్మద్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఇతర అధికారులు స్థలాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
దళిత, గిరిజనులపై
దాడులు ఆపాలి
మెదక్‌జోన్: దేశంలో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల మీద జరుగుతున్న దాడులను తక్షణం ఆపాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తరుణ్ డిమాండ్ చేశారు. బీజేపీ, జేడీయూ, ఆర్‌ఎస్‌ఎస్‌ల సంకీర్ణ భావజాలాన్ని ఖండిస్తూ, దళిత విద్యార్థులను కలవడానికి బీహార్ వెళ్లిన రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు పరశురాం, శ్రీకాంత్, రమేష్, రితికేష్ తదితరులు పాల్గొన్నారు.
కొప్పోల్‌లో భక్తుల సందడి
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని కొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయ ఆవరణలో ఆదివారం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 108 మంది దంపతులు పూజలో పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
భక్తజన సంద్రం..
కొమురవెల్లి క్షేత్రం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేకపూజ లు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణి చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. అలాగే కోడెల స్తంభం వద్ద కోడెలను కట్టి పూజలు చేశారు.
కొండగట్టుకు పాదయాత్ర
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్‌కు చెందిన హనుమాన్ మాలధారులు ఆదివారం కొండగట్టు హనుమాన్ దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. వంద మంది హనుమాన్ భక్తులు ముందుగా రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జగి త్యాల జిల్లాలోని కొండగట్టు హనుమాన్ దేవాలయానికి పాదయత్రగా తరలివెళ్లారు. గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు.

‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన

‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన

‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన

‘సమీకృతం’ కోసం స్థల పరిశీలన