
అధిక తరుగు తీస్తే చర్యలు తప్పవు
కల్హేర్(నారాయణఖేడ్): రైతులకు ఇబ్బంది లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి సూచించారు. కల్హేర్‌లో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రైతులతో మాట్లడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. అధికంగా తరుగు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ సీడీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ పీఎసీఏస్ చైర్మన్ వీర్‌షెట్టి, కాంగ్రెస్ నాయకులు దేవదాస్, తుకరాం, జితేందర్‌రెడ్డి ఉన్నారు.