డెంగీపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

డెంగీపై అవగాహన కల్పించాలి

May 17 2025 8:14 AM | Updated on May 17 2025 8:14 AM

డెంగీ

డెంగీపై అవగాహన కల్పించాలి

సజావుగా సభ నిర్వహించండి

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రజలను చైతన్య పరుస్తూ డెంగీ నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు డెంగీ ప్రబలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. జూన్‌ నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. డెంగీ లక్షణాలు ఉన్నటైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లా ఆస్పత్రికి వెళ్లి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స చేయించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మంగళ, శుక్రవారం డ్రైడే గా పాటించి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు విశేష కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం జాతీయ డెంగీ నివారణ దినోత్సవ వాల్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ధాన్యం కొనుగోలు, ఇతర సంక్షేమ పథకాలపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ శ్రీరామ్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సునీత, జిల్లా ఇంటర్మీడియెట్‌ అధికారి మాధవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు సృజన, జ్ఞానేశ్వర్‌, డీసీహెచ్‌ఓలు డాక్టర్‌ శివ దయాల్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): చిలప్‌చెడ్‌ రైతు వేదికలో నేడు నిర్వహించనున్న సభను సజావుగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో కలిసి సభాస్థలిని పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్‌ మండలంలో భూభారతి, రెవెన్యూ సదస్సులు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. భూ భారతి చట్టంపై మరింత అవగాహన కల్పి ంచేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సహదేవ్‌, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్‌గౌడ్‌, ఆర్‌ఐ సునీల్‌సింగ్‌, ఇన్‌చార్జి ఎంపీఓ తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

డెంగీపై అవగాహన కల్పించాలి1
1/1

డెంగీపై అవగాహన కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement