
బండ్ల జోరు.. జాతర హోరు
బొడ్మట్‌పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రుడి ఉత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. శుక్రవారం ఎడ్ల బండ్ల ఊరేగింపు వైభవంగా సాగింది. రంగురంగుల పూలతో బండ్లను అలంకరించారు. డప్పు చప్పుళ్ల మధ్య యువకుల నృత్యాలు అందరిని అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చేపట్టారు.
– టేక్మాల్(మెదక్)