టేక్మాల్(మెదక్): మండలంలోని బొడ్మట్‌పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్రుడి కల్యాణోత్సవం బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రాష్ట్ర మాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వీరభద్రుడికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వీరన్నస్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో భక్తులు ఊరేగింపు నిర్వహించారు. మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీఎస్పి ప్రసన్నకుమార్, డీఎంహెచ్‌ఓ శ్రీరాం, జోగిపే ట మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్‌రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇసుక రవాణా చేస్తే కేసులు
పాపన్నపేట(మెదక్): మంజీరా నది నుంచి ఇసుకను ఏ రూపాన రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని పాపన్నపేట తహసీల్దార్ సతీ ష్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ‘సాక్షిలో ’ఇసుకా సురుల తిరకాసు దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని తనిఖీల కోసం యూ సుఫ్‌పేట శివారులోని మంజీరా తీర ప్రాంతానికి పంపించారు. అయితే గాడిదలపై ఇసుక రవాణా చేసే వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. వారి కుటుంబీకులు అక్కడ ఉండగా, మంజీరా నుంచి ఇసుక తీయొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. ట్రాక్ట ర్లు, లారీలు, గాడిదలపై ఏ రూపాన ఇసుక రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు వివరించారు.
భూ సమస్యలకు పరిష్కారం
చిలప్‌చెడ్(నర్సాపూర్): భూ సమస్యలు ఉన్న రైతులకు భూ భారతి చట్టంతో సులభ పరిష్కారం దొరుకుతుందని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ అన్నారు. బుధవారం చిలప్‌చెడ్ రైతువేదికలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించి మాట్లాడారు. పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్‌లో రెవెన్యూ సదస్సులు ముగిశాయని తెలిపారు. మండలంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో పది రోజుల్లో జరిగిన సదస్సుల్లో సుమారు 900 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఎక్కువగా సాదాబైనామలు, పేరు మార్పిడిలు ఉన్నాయన్నారు. త్వరలోనే దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి, సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ సింధూజ, ఆర్‌ఐలు సునీల్ సింగ్, వెంకటేశ్వర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని చీలాపల్లి దుర్గమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. బుధవారం ఆలయ ఆవరణలో నిర్వహించిన పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
కోతి డాడిలో బాలుడికి గాయాలు
చేగుంట(తూప్రాన్): కోతి దాడిలో బాలుడు గాయపడిన సంఘటన మండల కేంద్రంలోని ఎన్‌జీఓ కాలనీలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాలనీలోని ఓ భవనంలో అద్దెకు ఉన్న దంపతుల మూడు సంవత్సరాల బాలుడు ఆడుకుంటుండగా కోతుల గుంపు వచ్చింది. అందులోని ఓ కోతి బాలుడిని కరిచింది. దీంతో స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

వీరభద్రుడికి మంత్రి ప్రత్యేక పూజలు

భూ సమస్యలకు పరిష్కారం