నర్సాపూర్: మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ అన్నారు. ఆదివారం కెంటెల్, రిస్క్‌గార్డ్, ఎస్– హాచ్ సంస్థలు స్థానిక బీవీ రాజు ఇంజనీరింగ్ కాలేజీతో కలిసి హైదరాబాద్ టీ– హబ్‌లో మెంటరెక్స్ కార్యక్రమం నిర్వహించాయి. కార్యక్రమానికి ముఖ్య అథితిగా జయేశ్‌రంజన్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీ–హబ్ మాజీ సీఈఓ మహంకాళీ శ్రీనివాస్‌రావు, విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, బీవీ ఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె తదితరులు మాట్లాడారు.