విద్యుత్‌షాక్‌తో ఒకరు..
ఖానాపూర్: విద్యుత్‌షాక్‌కు గురై ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల వెంకట్రాములు(49) శనివారం రాత్రి మొక్కజొన్న పంట పొలానికి నీరుపెట్టేందుకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకోలేదు. అయ్యప్ప మాలలో ఉన్న వెంకట్రాములు ఆలయంలో నిద్రిస్తున్నాడని కుటుంబీకులు అనుకున్నారు. ఉదయం పంట వైపు వెళ్లిన వేముల శ్యాంసుందర్ అక్కడ పడి ఉండడం చూసి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
జైపూర్: మండలంలోని ఎల్కంటి గ్రామానికి చెందిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నా యి.. మండల రెడ్డి జాగృతి అ ధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు బేతు తిరుపతిరెడ్డి–విజయ దంపతుల కుమారుడు భరత్‌రెడ్డి. వరంగల్ గ్రీన్‌వుడ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అక్కడే హాస్టల్‌లో ఉంటూ ఇటీవల స్కూల్‌లో నిర్వహించిన గేమ్స్‌లో పాల్గొనగా చేతికి గాయమైంది. విషయం తెలుసుకున్న తిరుపతిరెడ్డి శనివారం భరత్‌రెడ్డిని మంచిర్యాలలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. శరీరంలో రక్తం గడ్డ కట్టుకుపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కరీనంగర్ రెఫర్ చేశారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి ఆదివారం హైదరాబాద్‌కు తరలించగా, కొద్దిసేపటికే మృతి చెందాడు.
భరత్‌రెడ్డి (ఫైల్)
విద్యుత్‌షాక్‌తో ఒకరు..


