ఖోఖో విజేత ఆదిలాబాద్
ఆదిలాబాద్: ఖోఖో విజేతలుగా ఆదిలాబాద్ బాలుర, బాలికల జట్లు నిలిచాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు వేదికగా నిర్వహించిన 44వ తెలంగాణ జూనియర్ ఇంటర్ డిస్టిక్ర్ట్ ఖోఖో టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రంగారెడ్డిపై ఆదిలాబాద్ బాలుర జట్టు, మహబూబ్‌నగర్‌పై ఆదిలాబాద్ బాలికల జట్టు ఘన విజయం సాధించినట్లు శిక్షకులు శంకర్, రామ్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, సీనియర్ పీడీ దయానంద రెడ్డి, శివ, తిరుమల, కృష్ణ తదితరులు విజేతలుగా నిలిచిన జట్లను అభినందించారు.


