ఎన్నికల వేళ.. సోషల్ మీడియా జోరు
కోటేషన్లతో వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్టులు
సిరికొండ: పంచాయతీ ఎన్నికల వేళ..సోషల్ మీడియాలో పోస్టులు జోరందుకున్నాయి. యువత తమ ఆలోచనలు వాట్సాప్ గ్రూప్‌ల్లో పోస్తూ చేసి అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘నువ్వు రాజకీయాలపై నోరు మూస్తే..అవి నీ శ్వాసపై కూడా పన్ను వేస్తాయి’, ‘ఓటేసేవాడి కోసం కష్టపడేవాడు సర్పంచ్ కావాలి’‘ఒక్క ఓటు..ఊరి భవిష్యత్తు’ఈసారైనా పది మందికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోండి అంటూ యువకులు తమ కోటేషన్లతో తమ గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు. పార్టీ ఏదైనా సరే రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి..అంటూ వాట్సాప్ పోస్టు లు, స్టేటస్‌లు పెడుతున్నారు.
ఎన్నికల వేళ.. సోషల్ మీడియా జోరు


