వరిధాన్యం తిని 40 గొర్రెలు మృతి
చెన్నూర్‌రూరల్: మండలంలోని తుర్కపల్లి స మీపంలోని వరి ధాన్యం తిని 40 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. సుద్దాల, తుర్కపల్లి గ్రామాలకు చెందిన గానవేన పోచయ్య, బట్టి శ్రీశైలం, అక్కల పోచ య్యలకు చెందిన గొర్రెలు శనివారం వరి చేలలో మేతకు వెళ్లాయి. అక్కడ వరి ధాన్యం తిని మృత్యువాత పడుతున్నాయి. సమాచారం అందుకున్న కత్తెరసాల పశువైద్యాధికారి సతీశ్ అక్కడకు వెళ్లి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆదివారం వరకు 40 గొర్రెలు మృతి చెందాయి. పరిస్థితి విషమంగా ఉన్న 17 గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. ఇవి కోలుకోవ డం కష్టమేనని తెలిపారు. కత్తెరసాల, ఆస్నాద, భీమారం పశువైద్యాధికారులు శ్రీనివాస్, రాకేష్‌శర్మ, సిబ్బందితో కలిసి జిల్లా పశు వైద్యాధికారి శంకర్ అక్కడికి వెళ్లి గొర్రెల మృతికి గల కారణాలు తెలుసుకున్నారు. వాటికి పోస్టుమార్డం నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ చల్ల రాంరెడ్డి, యాదవ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఈర్ల మల్లికార్జున్ బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గొర్రెల యాజమానులు కోరుతున్నారు.


