రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై స్వరూప్‌రాజ్ కథనం ప్రకారం.. బెల్లంపల్లి మండలం లంబాడితండాకు చెందిన నూనె రాజశేఖర్(30) ప్రస్తుతం హాజీపూర్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ సమీపంలో జాతీయ రహదారి పక్క నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. లక్సెట్టిపేట నుంచి మంచిర్యాల వైపు వస్తున్న కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో ఢీ కొట్టాడు. తీవ్రగాయాలైన రాజశేఖర్‌ను వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి వివాహం కాలేదు. మేన వదిన చింతకింది లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


