సాఫ్ట్‌బాల్ విజేత రంగారెడ్డి
ఇచ్చోడ: 12వ రాష్ట్రస్థాయి సీనియర్ పురుషు ల సాఫ్ట్‌బాల్ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో రంగారెడ్డి 7–2తో మహబూబ్‌నగర్‌పై ఘన విజయం సాధించింది. మండల కేంద్రంలోని గిరిజన గురుకు ల బాలుర పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆదివారం ముగిశా యి. రాష్ట్రవ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టుతో తలపడి రంగారెడ్డి జట్టు గెలుపొందింది. విజే త జట్టుకు కప్‌తోపాటు బంగారు పతకం, ద్వితీయస్థానంలో మహబూబ్‌నగర్‌కు రజ తం సాధించింది. హన్మకొండ జట్టు 4–3తో హైదరాబాద్‌పై గెలిచి తృతీయస్థానంలో నిలువగా కన్సోలేషన్ బహుమతి పొందింది. గెలుపొందిన జట్లకు జిల్లా యువజన, క్రీడల అధికారి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. సాఫ్ట్‌బాల్ అసోషియేషన్ ఆప్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్‌బాబు, తెలంగాణ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్, జిల్లా కార్యదర్శి గంగాధర్, శిక్షకులు చిన్నికృష్ణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.


