
నకిలీ పోలీస్ అరెస్ట్
గుడిహత్నూర్: పోలీ స్ అవతారమెత్తి ప్ర జలను మోసగిస్తూ, డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఇ చ్చోడ సీఐ బండారి రాజు, పీఎస్సై మధుకృష్ణ తెలిపారు. వారి కథ నం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా వ్యక్తి కనిపించా డు. సదరు వ్యక్తిని విచారించగా నార్నూర్‌కు చెందిన కుడ్మెత నాగరావ్ అని గుర్తించి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. పోలీసు యూనిఫాంతో ఉన్న అతడి ఫొటోలు ఉన్నాయి. వాట్సాప్ డీపీలో యూనిఫాం వేసుకున్న ఫొటో పెట్టాడు. వీటిని చూపిస్తూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి పోలీస్ అని రాసి ఉన్న బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.