
క్యాప్ స్కాలర్‌షిప్ పోటీలకు ఎంపిక
బెల్లంపల్లి: ప్రతిష్టాత్మక క్యాప్ స్కాలర్‌షిప్ క్రీడా పోటీల్లో పాల్గొనడానికి బెల్లంపల్లికి చెందిన ఓ విద్యార్థి ఎంపికయ్యాడు. మహారాష్ట్ర పూణెలోని ఇర్ఫాన్ పఠాన్ క్రికెట్ అకాడమీలో ఇటీవల క్యాప్ స్కాలర్‌షిప్ కోసం విద్యార్థుల ఎంపిక పోటీలు జరిగాయి. బెల్లంపల్లి అశోక్‌నగర్ బస్తీకి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థి రెడ్డి.రిత్విక్ అండర్–14 విభాగంలో సత్తాచాటాడు. క్యాప్ స్కాలర్‌షిప్ కోసం నిర్వహించే తుది క్రికెట్ పోటీల్లో పాల్గొనడానికి అర్హత సాధించాడు. రిత్విక్ మరో మూడు క్రికెట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆ పోటీల్లో మెరుగ్గా రాణిస్తే స్కాలర్‌షిప్ పొందడానికి ఎంపికవుతాడు. ఎంపికై న విద్యార్థులకు రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది.