
‘ది స్టూడెంట్ మ్యాగజైన్’ ఆవిష్కరణ
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) విద్యార్థుల మాసపత్రిక ‘ది స్టూడెంట్ మాగజైన్’ను గురువారం ఆవిష్కరించారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, వోఎస్డీ డాక్టర్ ఈ.మురళీధర్, డాక్టర్ పి.చంద్రశేఖరరావు, డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ టి.రాకేశ్‌రెడ్డి, నాగరాజు తదితరులు సంచికను విడుదల చేశారు. ఈ మ్యాగజైన్‌లో యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏప్రిల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు, విద్య, సాంస్కృతిక, క్రీడారంగాల్లో విద్యార్థుల సాధనలను పొందుపర్చారు. పత్రికలో విద్యార్థుల కథనాలు, సృజనాత్మక రచనలు, విజయాలు, వినూత్న ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతినెలా విడుదలయ్యే ఈ పత్రిక, విద్యార్థులకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, సామాజికవర్గాలకు విద్య, పర్యావరణంపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల ఎడిటోరియల్ బృందం, డాక్టర్ టి.రాకేశ్‌రెడ్డి మార్గదర్శనంలో ఈ పత్రికను రూపొందించింది.