
కంపు కొడుతున్న ‘క్యాతనపల్లి’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సమస్యకు సరైన పరిష్కారం లభించడం లేదు. బల్దియాలో మొత్తం 22 వార్డులుండగా దాదాపు 48,950 మంది జ నాభా ఉన్నారు. మున్సిపాలిటీలో ఎక్కువ వార్డులు సింగరేణి పరిధిలో ఉండటంతో చె త్త సేకరణ సమస్యగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ దాదాపు నిత్యం జరుగుతుండగా సింగరేణి పరిధిలోని కాలనీల్లో రెండు, మూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం కాకుండా సింగరేణి ఆధ్వర్యంలో పాత పద్ధతిలోనే చెత్త సేకరణ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కాలనీలు కంపు కొడుతున్నాయి. చె త్త సేకరణకు 16 ఆటోలు, రెండు ట్రాక్టర్లు, 20 మంది వరకు డ్రైవర్లున్నారు. రోజుకు సుమారు 14 మెట్రిక్ టన్నుల చెత్తను ము న్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తున్నారు. తొమ్మిదోవార్డు పరిధి పెద్దది కావడంతో చెత్త సేకరణ కోసం త్వరలో రెండు, మూడు పెద్ద ట్రాలీలు కొనుగోలు చేయనున్నట్లు మున్సి పల్ కమిషనర్ రాజు తెలిపారు.
క్యాతనపల్లి
మున్సిపాలిటీ వివరాలు
మున్సిపల్ వార్డులు : 22
జనాభా : 48,950
రోజుకు వెలువడే చెత్త :
14 మెట్రిక్ టన్నులు
చెత్త సేకరించే వాహనాలు : 18