
ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో విచారణ
● హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతి
కోటపల్లి: పాఠశాల పునఃప్రారంభం రోజు కాకుండా సోమవారం వచ్చిన విద్యార్థినులు, వారితో వ చ్చిన తల్లిదండ్రులను కోటపల్లి గిరిజన బాలికల ఆ శ్రమ పాఠశాల ప్రిన్సిపల్ బయటే వానలో నిల్చోబెట్టారు. దీనిపై ‘ఆలస్యంగా వచ్చారని..’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. డీటీడీవో జనార్దన్ పాఠశాలను సందర్శించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థినులతో మాట్లాడి హెచ్‌ఎం అ శోక్‌ను మందలించినట్లు సమాచారం. విద్యార్థినులు పాఠశాలకు సక్రమంగా హాజరు కావాలని సూచించారు. పదో తరగతిలో ఉ త్తమ ఫలితాలు సాధించేలా వి ద్యార్థినులను తీర్చిదిద్దాలని హెచ్‌ఎంను ఆదేశించా రు. కాగా, విచారణకు వచ్చిన డీటీడీవో విద్యార్థినులు, హెచ్‌ఎం అశోక్ ముందే విచారణ చేపట్టారు. దీంతో విద్యార్థినులు హెచ్‌ఎంపై ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడినట్లు సమాచారం. గతంలో పలు సార్లు హెచ్‌ఎంపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా నామమాత్రపు విచారణతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు స్పందించి బాలికల పాఠశాలకు మహిళా హెచ్‌ఎంను నియమించాలని, హెచ్‌ఎం వైఖరిపై లోతుగా విచారణ జరిపించాలని తలిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో విచారణ