
మూడోరోజూ అదే ముసురు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాను మూడురోజు లుగా ముసురు వీడడం లేదు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. చల్లని ఈదురుగాలలు వీ స్తుండడంతో చిన్నారులు, వృద్ధులు వణుకుతో మంచం పడుతున్నారు. ఆలస్యంగానైనా పత్తిపంటకు అనుకూల వర్షం కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 8.8 మిల్లి మీటర్ల వర్షం
జిల్లాలో మంగళవారం 8.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. దండేపల్లి 33.3 మిల్లిమీ టర్లు, లక్సెట్టిపేట 14, జన్నారం 11.6, హా జీపూర్ 12.5, భీమిని 10.1, వేమనపల్లి 8.8, బెల్లంపల్లి 8.6, కన్నెపెల్లి 8.4, తాండూర్ 8, కోటపల్లి 7.5, నెన్నెల 6, మంచిర్యాల 5, కాసిపేట 4, నస్పూర్ 3.4, జైపూర్ 3, చెన్నూరు 3.5, భీమారం 1.9 మిల్లిమీటర్ల వర్షం కురి సింది. జిల్లా సాధారణ వర్షపాతం 168 మిల్లిమీటర్లు కాగా, 104.5 మిల్లిమీటర్లు కురిసింది. 38శాతం లోటు నెలకొంది.