
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భీమిని: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూ చించారు. మంగళవారం కన్నెపల్లి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించా రు. అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గ్రా మాల్లో పారిశుధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం కన్నెపల్లి, టేకులపల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. కన్నెపల్లిలోని కేజీబీవీని సందర్శించి వంటశాల, తరగతి గ దులు, రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశా రు. కన్నెపల్లి ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల మూసి ఉండగా నీటి వసతి కల్పించి విద్యార్థులు వి నియోగించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన పీహెచ్‌సీ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
బాలల హక్కులు కాపాడాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: బాలల హక్కులను కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖల అధికారులు, పోలీస్, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వరకు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని అన్ని పని ప్రదేశాలను సందర్శించాలని తెలిపారు. అనంత రం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ వహిద్, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమశాఖల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, పురుషోత్తం, మైనార్టీ శాఖ అధికారి రాజేశ్వరి, డీఈవో యాదయ్య, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు రవికుమార్, వెంకటేశ్వర్లు, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఆనంద్ ఉన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ చాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు–భవనా లు, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.