
చెన్నూర్‌లో చెత్త కుప్పలు
చెన్నూర్ మున్సిపాలిటీ వివరాలు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. రెండు, మూడు రోజులకోసారి చెత్త వాహనాలు రావడంతో కుప్పలుగా పేరుకుపోతోంది. వానాకాలం కావడంతో చెత్త కుప్పుల నుంచి దుర్గంధం వ్యాపిస్తున్నట్లు సమీప నివాసాల ప్రజలు వాపోతున్నారు. 18 వార్డులుండగా 25,579 మంది జనాభా ఉన్నారు. రోజూ చెత్త సేకరించాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం 18 వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 11 వాహనాలు మూలనపడి మరమ్మతుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఏడు వాహనాల ద్వారానే చెత్త సేకరించాల్సి వస్తోంది. వాహనాల కొరతతో వార్డుల్లో రెండు, మూడురోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. దీంతో కాలనీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గతంలో ఒక్కో చెత్త వాహనానికి డ్రైవర్‌తో పాటు హెల్పర్ ఉండేవారు. వీరు ఆయా కాలనీల నుంచి సేకరించిన చెత్తను డంప్‌యార్డుకు తరలించేవారు. ప్రస్తుతం ఒక్కో వాహనానికి ఒక్క డ్రైవర్ మాత్రమే ఉండడంతో ఇళ్ల నుంచే చెత్త సేకరిస్తున్నారు. దీంతో పారిశుధ్యం లోపించి జనం పరేషాన్ అవుతున్నారు. రో జూ చెత్త సేకరించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు.
మున్సిపల్ వార్డులు : 18
జనాభా:
25,579 మంది
చెత్త సేకరించే వాహనాలు : 18
వినియోగిస్తున్నవి : 7
మూలనపడ్డవి : 11
కంపు భరించలేక పోతున్నం
చెత్త బండ్లు మూడు రోజు లకోసారి వస్తున్నయ్. దీంతో కాలనీలో రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్క డే చెత్త పేరుకుపోతోంది. వానాకా లం కావడంతో చెత్త కుప్పల్లో పందులు దొర్లుతున్నాయి. కంపు భరించలేకపోతున్నం. రోజూ చెత్త తరలించేలా చూడాలె.
– మధునక్క, లైన్‌గడ్డ, చెన్నూర్

చెన్నూర్‌లో చెత్త కుప్పలు