
ఘనంగా మాతృదినోత్సవం
మంచిర్యాలటౌన్: లయన్స్ క్లబ్, వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం మాతృ దినోత్సవం నిర్వహించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. తర్వాత 40 మంది మాతృమూర్తులను సత్కరించారు. భోజనం అందించారు. కా ర్యక్రమంలో వి.మధుసూదన్‌రెడ్డి, హన్మంతరావు, వినయ్‌కుమార్, రామాంజనేయులు, కారుకూరి చంద్రమౌళి, భాగ్యలక్ష్మి, ఇందిరాదేవి, కె.మంగా రెడ్డి, రజినిరెడ్డి, డాక్టర్ విశ్వేశ్వర్‌రావు పాల్గొన్నారు.
వనితావాక్కు ఆధ్వర్యంలో..
వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కుర్మ సునీత, జ్యోత్స్న చంద్రదత్, చిగురు మంజుల, కొండా శైలజ, బద్రి శ్రీదేవి, సంగీత, సత్యవతి, కమల పాల్గొన్నారు.