
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
లక్సెట్టిపేట: వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చే యాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నా రు. శనివారం మండలంలోని పోతపల్లి, లక్ష్మిపూర్, ఇటిక్యాల, మిట్టపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, రైస్‌మిల్లులను పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలు పడుతున్నాయని, గన్నీ బ్యాగుల కొరత ఉంటే తెలియజేయాలని అన్నారు. మిట్టపల్లి గ్రా మంలో శివరామ క్రిష్ణ ట్రేడర్స్ మిల్లును పరిశీలించారు. ఇప్పటి వరకు 84,700 బస్తాలను మిల్లుకు చేర్చినట్లు తెలిపారు. మిల్లుల వద్ద లారీలను అన్‌లోడ్ చేసిన వెంటనే పంపించాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. తహసీల్దార్ దిలీప్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.