
కార్మికులు సమ్మెలో పాల్గొనాలి
శ్రీరాంపూర్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ 3, 3ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో కార్మికులకు చరిత్రాత్మక ఒప్పందాలు, హక్కులు సాధించామని తెలిపారు. వివిధ యూనియన్లకు చెందిన సుమారు 80 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. వారికి రాజిరెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ నాయకులు బండి రమేష్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, అన్వేశ్‌రెడ్డి, లాల, మైపాల్ రెడ్డి, బుస్సా రమేష్, వెంగళకుమార్‌స్వామి, గొర్ల సంతోష్, ఫిట్ సెక్రెటరీ వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.