
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
నెన్నెల: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామాలకు తరలిరండి’ అనే కార్యక్రమాన్ని నెన్నెల, నందులపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు, రైతులు, కార్మికులపై పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపర్చారు. విద్యార్థులంతా ప్రజల జీవన స్థితిగతులను అధ్యాయనం చేయాలన్నారు. గ్రామాల్లో పేదలకు పక్కా ఇళ్లు, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు దుర్గం బ్రహ్మానందం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ఎం.గణేశ్, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మి, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రత్నం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.