
జాతీయస్థాయి పోటీలకు రెఫరీగా ఎంపిక
పాతమంచిర్యాల: జాతీ యస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు రెఫరీగా జుమ్మి డి కళ్యాణ్ ఎంపికై నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌రావు, ప్రధా న కార్యదర్శి కనపర్తి రమే శ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు తమిళనాడులోని తిరువన్నమలైలో నిర్వహించనున్న హెఫ్‌ఐ 40 సౌత్‌జోన్ హ్యాండ్‌బాల్ పోటీలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చెందిన కళ్యాణ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నట్లు వారు పేర్కొన్నారు.
వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన చిన్నం ధర్మేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీలోని కొనసీమ జిల్లాకు చెందిన ధర్మేందర్‌రెడ్డి పట్టుబడినట్లు తెలిపారు. అతన్ని తనిఖీ చేయగా రూ.11,750 నగదు, ఫైనాన్స్ చీటీలు, రిజిస్టర్లు దొరికినట్లు తెలిపారు. వాటితో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకుని తెలంగాణ ఏరియా మనీలెండర్‌యాక్ట్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.