
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’తో అనేక లాభాలు
బెల్లంపల్లిరూరల్: వ్యవసాయ సాగులో రైతులకు మరిన్ని లాభాలు చేకూర్చేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు ని త్యం రైతులకు అందుబాటులో ఉంటూ సాగులో ఉన్నతంగా రాణించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రో గ్రామ్ కో–ఆర్డినేటర్ కోట శివకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి జి.కల్పన మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సాగు ఖ ర్చును తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజానరేందర్, ఏవో ప్రేమ్‌కుమార్, హెచ్‌వో అర్చన, కేవీకే శాస్త్రవేత్తలు ప్రియ సుగంధి, తిరుపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రాంచందర్, పీఏసీఎస్ చైర్మ న్ స్వామి, నాయకులు దావ రమేష్ బాబు, రాయలింగు, రైతులు పాల్గొన్నారు.