
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
కాసిపేట: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 61మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల కు ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పేదింటి యువతుల వివాహానికి కు టుంబ సభ్యులు తీవ్రంగా శ్రమిస్తారని, వారి కి బాసటగా ఉండేందుకే ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఆదుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అన్నివర్గా ల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారా యణసింగ్, నాయకులు రత్నం ప్రదీప్, కారుకూరి రాంచందర్, మైదం రమేశ్, గోలేటి స్వామి, సిరాజ్‌ఖాన్ తదితరులున్నారు.